<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>408</hymn_number>
<lyrics>[C1]
   నీ ప్రేమే నను ఆదరించేను -2
   సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2

[V1]
 చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1
 ఉదయించెను నీ కృప నా యెదలో -
 చెదరిన మనసే నూతనమాయెనా -2
 మనుగడయే మరో మలుపు తిరిగేనా -2

[V2]
 బలసూచకమైనా మందసమా నీకై -1
 సజీవ యాగమై యుక్తమైన సేవకై -
 ఆత్మాభిషేకముతో నను నింపితివా -2
 సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా -2</lyrics>
<title>నీ ప్రేమే నను ఆదరించేను</title>
</song>